SRCL: వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.