KMR: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఫిజికల్ డైరెక్టర్ మల్లయ్య అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన పిట్లం మండలంలో చోటు చేసుకుంది. పెద్దకొడుకు పగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మల్లయ్య పీడీగా పనిచేస్తున్నారు. కామారెడ్డి నుంచి మర్ధండ స్వగ్రామానికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.