HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో రాజీవ్ నగర్ కాలనీలో బూత్ కమిటీ కన్వీనర్లతో ‘మాటముచ్చట’ కార్యక్రమం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగరవేయాలంటే ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కన్వీనర్లకు బాధ్యతలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.