WNP: అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం కలగాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తకోట ఖాద్రియా మజీద్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులను అందజేస్తూ ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తు చేశారు.