ADB: ఆదిలాబాద్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి ఎస్ఏ-2 (వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టాస్ (TOSS) పరీక్షల నేపథ్యంలో గత షెడ్యూల్ను విద్యాశాఖ రెండు రోజులు ముందుకు మార్చింది. ఏప్రిల్ 18 వరకు ఇవి కొనసాగుతాయి. నేడు 6-9 తరగతుల వారికి ప్రథమ భాషా పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు మారిన సమయాలను గమనించి హాజరు కావాలని డీఈఓ అన్నారు.