»Action Will Be Taken Against Sharmila Commissioner Cv Anand
YS Sharmila : షర్మిలపై చర్యలు తీసుకుంటాం : కమిషనర్ సీవీ ఆనంద్
వైఎస్ షర్మిల (YS Sharmila) ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం వీడియోలో కనిపించింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని ఆయన తెలిపారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు షర్మిలకు ముందే చెప్పామని… అయినా ఆమె పట్టించుకోకుండా వెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆమెను బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు (police) యత్నించగా వారిపై దాడి చేశారని కమిషనర్ వెల్లడించారు. షర్మిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ (woman constable)పై షర్మిల తల్లి విజయమ్మ కూడా చేయి చేసుకున్నారు. టీఎస్పీఎస్పీ (TSPSP)పేపర్ లీకేజ్ విషయంలో సిట్ అధికారును కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కారులో ముందుకు వెళ్లేందుకు ఆమె యత్నించారు. ఈ క్రమంలో కారును చుట్టుముట్టిన పోలీసులు, డ్రైవర్ ను లాగి పడేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల కారు నుంచి కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.