SRPT: రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అందుబాటులో ఉంచడానికి కృషి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు యూరియా అందకుంటే ఆందోళన బాట పట్టడం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.