VKB: గణేశ్ నిమజ్జన వేడుకలను ప్రశాంతం వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. ఇవాళ పట్టణంలో నిర్వహించే నిమజ్జన వేడుకల్లో భాగంగా యబ్బనూరు చెరువు వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. హిందూ సంఘాలు, అధికారుల సమన్వయంతో నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.