MBNR: భూత్పూర్ మున్సిపాలిటి ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని మున్సిపాలిటీకి చెందిన రాజగోపాల్ రెడ్డి శనివారం ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని పన్నులు వసూలు చేశారని, వాటిని ఎలా ఖర్చు చేశారో తెలియజేయాలని దరఖాస్తులలో పేర్కొన్నారు.