ADB: సమాజంలో రక్తదానం కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ అన్నారు. శనివారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ప్రతిఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.