KMR: ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో లయన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. వారికి వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.