WNP: రాజకీయ పబ్బం కోసం బాధిత కుటుంబాన్ని వాడుకోవడం సిగ్గుచేటని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయాలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వనపర్తిలోని ఓ పాఠశాలలో ఒక వ్యక్తి చేసిన తప్పును పట్టుకుని, BJP నాయకులు చేస్తున్న విమర్శలు అత్యంత హేయమైనవని అన్నారు.