KNR: శంకరపట్నం మండలంలోని 27 గ్రామపంచాయతీలకు జరుగుతున్న రెండో విడత ఎన్నికలకు పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఉదయమే బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలను చేపట్టారు.