KMR: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ‘టీటా’సహకారంతో నిర్వహించే ఈ మేళాలో 10 నుంచి PG వరకు చదివిన 18-30 ఏళ్ల యువతీ యువకులు అర్హులన్నారు. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీఐ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గలవారు 15వ తేదీ ఉ 9 గంటలకు హాజరుకావాలన్నారు.