MNCL: మందమర్రి ప్రాణహిత కాలనీలో కానిస్టేబుల్ కుమార్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ACP కిరణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఆదివారం రాత్రి సీఐ రమేశ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును నిశితంగా గమనించారు. పరిసర ప్రాంతాల ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఇంటి వద్ద ఆధారాలు సేకరించి, దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.