SRPT: కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో నిర్వహిస్తున్న ఔషధ బ్యాంకుకు దాతల సహకారం అభినందనీయమని కోదాడ పశు వైద్యాధికారి పెంటయ్య అన్నారు. ఇవాళ కోదాడ పట్టణానికి చెందిన శ్రీనివాసరావు రూ.6 వేల విలువైన 32 పూండ్ ఫైట్ ఔషధ సీసాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. పశు వైద్యశాలకు దాతల సహకారం అభినందనీయమన్నారు.