WNP: ఆత్మకూరు సమీపంలోని పరమేశ్వర స్వామి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మంగళవారం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన శివాజీనగర్‌కు చెందిన నాని కావచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.