SDPT: నంగునూరు మండలంలోని నర్మెట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి పెట్టాలని రైతులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలో జాప్యం కాకుండా చూసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.