SRD: హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్షురాలు జి. సునీత, ప్రధాన కార్యదర్శి నాయిని లలిత మహిళా లోకానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయని బీరంగూడలో వాల్ పోస్టర్లు విడుదల చేశారు. 1000 మంది ప్రతినిధులు, 4 రోజుల సభలు ఉంటాయన్నారు.