NRML: కుభీర్ మండలంలోని సోనారి గ్రామానికి చెందిన ఎలవంత్ రావ్, విట్టల్, బండు పటేల్, చిరంజీవి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వారికి సూచించారు.