ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో 2020లో జరిగిన భారీ దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. బంగారం వ్యాపారి శ్రీపాల్ జైన్ పై దాడి చేసి సొత్తు దోచుకెళ్లిన నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం జీఆర్పీ సీఐ అంజలి వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని రాజస్థాన్లో పట్టుకోగా, మిగిలిన ఇద్దరిని గాజువాక, విజయవాడల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.