NZB: ఏర్గట్ల మండల కేంద్రంలో దుర్గామాత శోభాయాత్ర గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న దుర్గమ్మ నిమజ్జనం కోసం బయలుదేరింది. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తులు కోలాటం ఆడుతూ, హారతులు సమర్పించారు.