AP: కర్నూలు(D) దేవరగట్టులో రాత్రి జరిగిన బన్ని జైత్రయాత్ర(కర్రల సమరం)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీపడగా, కర్రలతో జరిగిన దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని ఆదోనిలోని ఆస్పత్రులకు తరలించారు.