GNTR: కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలు శుక్రవారం వరద ఉద్ధృతి భారీగా తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉదయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,97,520 క్యూసెక్కులుగా నమోదైందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. లంక పొలాల రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. పొలాల్లో చేరిన నీరు ఇప్పుడిప్పుడే బయటకు పోతోందని సంతోషం వ్యక్తం చేశారు.