పాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పెషావర్లో పేలుడు సంభవించగా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నాలుగు రోజుల క్రితం క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.