ప్రకాశం: వెలిగండ్ల మండలంలో శుక్రవారం నుంచి ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఏపీవో శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూలీలకు కేటాయించే పనులు గ్రామస్థుల భాగస్వామ్యంతో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరుగుతుందని వెల్లడించారు.