ప్రకాశం: కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన మున్నంగి జయకుమార్ అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. గత కొన్ని సంవత్సరాలుగా నాయుడుపాలెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఆగష్టు నెలలో పదవీ విరమణ చేశారు. అతని మృతిపట్ల కురిచేడు మండల ఏపీటీఎఫ్ బాధ్యులు, ఉపాద్యాయులు సంతాపం తెలిపారు.