BDK: శుభ్రత, సమయపాలన, సమర్థవంతమైన కార్యనిర్వాహణ ముఖ్యమని ఏరియా మేనేజర్ షాలేము రాజు అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు సింగరేణి ఏరియాలో గురువారం నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమం ప్రారంభమైందని వారు తెలిపారు. ప్రతి ఉద్యోగి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం స్పెషల్ క్యాంపెయిన్ ప్రతిజ్ఞ చేశారు.