ప్రకాశం: గిద్దలూరుకు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి శుక్రవారం రానున్నారు. వైసీపీ కార్యాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. అలాగే, పార్టీ పరిస్థితులపై చర్చిస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆయనకు చెప్పాలని కార్యాలయ ప్రతినిధులు కోరారు.