AKP: విజయదశమి సందర్భంగా కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో మూడు రోజులు పాటు నిర్వహించిన వాలీబాల్ లీగ్ పోటీలు గురువారం రాత్రి విజయవంతంగా ముగిసాయి. మండలంలో మొత్తం తొమ్మిది టీమ్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాట్నాలపాలెంకు చెందిన సంగీత టీం విన్నర్‌గా నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.