TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.