SKLM: భారీ వర్షాలకు వంశధారలో వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం నదిలో 69 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరో గంటలో 90 వేల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. నరసన్నపేట మండలం గెడ్డవాని పేట వద్ద శుక్రవారం ఉదయం వరద పరిస్థితిని పై ఫోటోలో చూడవచ్చు. మరికాసేపట్లోనే ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.