HYD: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ సమ్మేళనం జరగనుంది. పుష్కర కాలం నుంచి దసరా మరుసటి రోజున నిర్వహిస్తున్న ఈ వేడుకకు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.