విశాఖపట్నంలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు 0891-2590100, 0891-2590102, విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) నంబర్ 8500834958, భీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) నంబర్ 8074425598 అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.