GNTR: మంగళగిరి పరిధి జాతీయ రహదారిపై ప్రమాదకరంగా స్టెంట్లు చేసిన యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై వెంకట్ మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన రమేష్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగార్జున వర్సిటీ సమీపంలోని హైవేపై స్టంట్లు చేసిన వీడియో సోషల్ మీడియాలో పెట్టినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.