HYD: మూసీ నది అందాలు కనువిందు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరంలో మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల మేర విస్తరించింది. ముందుగా 20.5 కిలోమీటర్లను సుందీకరించనున్నారు. ఇందుకు దాదాపు రూ.5,641 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.5KM), ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ (11 KM) వరకు సుందరీకరించనున్నారు.