KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 17 ఖోఖో జట్ల ఎంపికలు ఈనెల 22వ(ఆదివారం) తేదీన ఖమ్మం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎసీఎఫ్ కార్యదర్శి నర్సింహమూర్తి తెలిపారు. 2008 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన ఇంటర్ చదివే వారు కూడా ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని, ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియానికి రావాలని కార్యదర్శి కోరారు. ఆధార్ కార్డు తప్పనిసరి అని సూచించారు.