SRD: పటాన్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం పటాన్ చెరులో బుధవారం ఉదయం 20.5 డిగ్రీలు, గుమ్మడిదలలో 19.4 డిగ్రీలు, జిన్నారంలో 19.9 డిగ్రీలు, అమీన్ పూర్లో 19.2 డిగ్రీలు, రామచంద్రాపురంలో 21.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 83%గా ఉంది. చలితో ఆస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.