JN: నేటి నుంచి కొడకండ్ల మండలంలో సాదా బైనామా దరఖాస్తుల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కోలా చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 2284 సాదా బైనమా దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 29 వరకు వెరిఫికేషన్ ఉంటుంది అన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి దరఖాస్తులను వెరిఫికేషన్ చేస్తామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.