MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నవజాత శిశువుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయన నవజాత శిశువులకు వైఎస్సార్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లు శిశువుల సంరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.