MDK: తూప్రాన్ పట్టణ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవ (స్వచ్ఛతోత్సవ్) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఒకటో వార్డులో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో శ్రమదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.