GNTR : చేబ్రోలు (M) వేజండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు నందిని, నాగసర్బా రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా ముల్తాయిపాలెం హైస్కూల్లో జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-14 బీచ్ వాలీబాల్ ఎంపికల్లో వారు ఈ విజయం సాధించారు. అక్టోబర్ 6న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థినులు పాల్గొంటారు.