యువత దారి వేరే మార్గంలో పయనిస్తోంది. తల్లిదండ్రులకు తెలియకుండా చాలా మంది పిల్లలు తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. కాలేజీ(Colleges)కి వెళ్లకుండా చదువు(Study)ను పక్కనబెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తన లవర్(Lover) కోసం మరో యువకుడితో ఓయో రూమ్లో గడిపింది. ఆ యువతిని వీడియో(Video) తీసిన ఆ వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్(Hyderabad)లో చోటుచేసుకుంది.
ఓ యువతి కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. తనకు ఇన్స్టాగ్రామ్(Instagram)లో పూర్ణేశ్ యాదవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని రోజులుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఓ రోజు పూర్ణేశ్ తనకు కొంత డబ్బు కావాలని ఆ యువతిని అడిగాడు. తన వద్ద లేదని ఆమె చెప్పింది. ఇంత వరకూ బాగానే ఉంది. తన లవర్ కోసం ఆ యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసిన అస్లాం అనే యువకుడిని డబ్బులు అడిగింది.
అస్లాం తన వద్ద డబ్బులు లేవన్నాడు. కానీ తనకు తెలిసిన సాయి చరణ్ అనే వ్యక్తితో ఒక రోజు గడిపితే డబ్బులు ఇస్తాడని చెప్పడంతో ఆ యువతి ఒప్పుకుంది. నారాయణగూడలోని ఓయో రూమ్(Oyo Room)లో ఆ యువతిని అస్లాం, సాయి చరణ్ కలిశారు. యువతి నగ్నంగా ఉన్న టైంలో ఆ ఇద్దరూ ఆమెను వీడియో(Video)ను తీశారు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్(Blackmail) చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు(Police Case) నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.