Viral Video: వీరికి భూమిమీద నూకలు ఉన్నాయి.. అందుకే బతికి బయటపడ్డారు
ఓ టూవీలర్‌ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
Video: కొన్ని యాక్సిడెంట్లను చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఆ ఫుటేజీ చూస్తే చాలు రోమాలు నిక్కబోడుస్తాయి. ఇక ప్రమాదంలో నుంచి బయటపడిన వారి సంగతి వేరు. ఆదిలాబాద్ (adilabad) జిల్లాలో ఇలాంటి ప్రమాదం జరిగింది. కంటైనర్ డ్రైవర్ రషీద్ ఖాన్ (rasheed khan) , టూ వీలర్ (two wheeler) మీద వెళుతోన్న వారి ప్రాణాలను కాపాడాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. క్లీనర్ (cleaner) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బైక్‌పై వస్తోన్న ముగ్గురు మాత్రం సేఫ్‌గా ఉన్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
ఘోర ప్రమాదం..
గుడిహత్నూర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ (hyderabad) నుంచి నాగ్ పూర్ వైపు కంటైనర్ వెళుతోంది. నేరడిగొండ మండలం చించోలికి చెందిన జంగు, కృష్ణ, సంతోష్ అనే ముగ్గురు మావల మండలం వాఘాపూర్‌లో అంత్యక్రియలకు వెళ్లి ఇంటికి వస్తున్నారు. సీతాగోంది వద్ద బైక్ మీద రోడ్డు దాటేందుకు ట్రై చేస్తున్నారు. అదే సమయంలో వేగంగా కంటైనర్ వస్తోంది. దానిని ఆ ముగ్గురు గమనించలేదు. రెండు వీడియోల్లో (video) అదీ స్పష్టంగా కనిపిస్తోంది.
హారన్ కొట్టినప్పటికీ నో యూజ్
ఆ టూవీలర్‌ను (two wheeler) ఢీ కొట్టేందుకు కంటైనర్ డ్రైవర్‌కు మనసు ఒప్పలేదు. అలా అని రైట్‌కు వాహనాన్ని వెళ్లనిచ్చే పరిస్థితి లేదు. లైఫ్ట్ వైపునకు వస్తూ.. హారన్ కొట్టాడు. అయినా ఆ ద్విచక్ర వాహనంపై ఉన్నవారిలో ఉలుకు లేదు పలుకు లేదు. టూ వీలర్‌ను డ్యాష్ ఇవ్వొద్దని వేగంగా వస్తోన్న వాహనాన్ని పూర్తిగా రైట్ సైడ్ పోనిచ్చాడు డ్రైవర్ రషీద్. ఆ వాహనం అదుపుతప్పి డివైడర్ మీద పడుకుంటూ వెళ్లింది. దీంతో కంటైనర్ డ్రైవర్ రషీద్ ఖాన్ (rasheed khan) తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఉన్న క్లీనర్ ఆబిద్ ఖాన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వారిద్దరినీ రిమ్స్ ఆస్పత్రికి (rims hospital) తరలించారు. టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు మాత్రం సేఫ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒళ్లు గగుర్పొడిచే వీడియో
అదిలాబాద్ – సీతాగోంది వద్ద నిర్లక్ష్యంగా బైక్ నడుపుతున్న ఇద్దరి ప్రాణాలు కాపాడి బోల్తా పడిన లారీ. pic.twitter.com/3z8lFzkpBI
రషీద్ సాహసం
సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన వీడియో (video) చూస్తే మాత్రం భయమేస్తోంది. ఎందుకంటే.. ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు రషీద్ (rasheed) తీవ్ర ప్రయత్నం చేశాడు. దీంతో అతని కంటైనర్ బోల్తా పడింది. తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న డ్రైవర్ రషీద్ చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. శభాష్.. రషీద్, నీ వల్లే ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారని గుర్తుచేస్తున్నారు. లేదంటే ఆ ముగ్గురు ఆ భూమి మీద ఉండేవారు కాదని అంటున్నారు. నిజమే.. డ్రైవర్ రషీద్ వల్లే వారికి తిరిగి లైఫ్ లభించినట్టు అయ్యింది.