BDK: అశ్వరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు నిర్వహిస్తున్నామని సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు. మండలంలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని గురువారం అశ్వరావుపేట రింగ్ సెంటర్లో అవగాహన కల్పించారు.