నారాయణపేట జిల్లా తపస్ అధ్యక్షుడు శేర్ కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ఊట్కూర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో ఊట్కూర్ మండల అధ్యక్షుడిగా కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గోపాల్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా నియమావళి అమలు అంశాలపై చర్చ జరిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.