SRD: అమీన్ పూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం 16.51 కోట్లతో సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ జ్యోతి రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు.