NRML: చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో వృద్ధ దంపతులపై దాడి చేసిన అమానుష ఘటన బాసర మండలం టాక్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు పోసాని రాజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన గంగామణి, పోతన్న, మారుతి, పోసాని, మల్లేష్, లింగన్నలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.