MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలలో నాలుగవ రోజు బాలురు మరియు బాలికల విభాగంలో అథ్లెటిక్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. రెండు క్రీడలలో కలిపి మొత్తం 400 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీల ముగింపు సమావేశానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు బహుమతులను అందజేశారు.