JGL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వార్షిక సంవత్సర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా నేర నివేదికను విడుదల చేశారు. సమర్థవంతమైన నాయకత్వంతో జిల్లా పోలీస్ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. నేరాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.